AP News: బాలింత పట్ల గ్రామ వాలంటీరు అసభ్య ప్రవర్తన

తాజా వార్తలు

Updated : 26/10/2021 06:47 IST

AP News: బాలింత పట్ల గ్రామ వాలంటీరు అసభ్య ప్రవర్తన

ఈనాడు డిజిటల్‌, అమరావతి, మాచవరం, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లకు చెందిన గ్రామ వాలంటీరు ఓ బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఈ నెల 22న వాలంటీరు మల్ల గోపి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో అతని భార్య ఇంట్లో ఉండటంతో భర్త ఫోన్‌ నంబరు కావాలని అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె బయటకు పరుగు తీసి, ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ ఫోన్‌ తీసుకొని విషయాన్ని భర్తకు చెప్పింది. దీనిపై బాధితురాలు మరుసటి రోజు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారించి ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు.

వాలంటీరుపై చర్యలు తీసుకోవాలి: వాసిరెడ్డి పద్మ ఆదేశం: బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీరుపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతోపాటు మాచవరం స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోతో ఆమె సోమవారం ఫోన్‌లో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించే ఏ స్థాయి ఉద్యోగినైనా క్షమించరాదన్నారు. విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడి విషయంలో కఠినమైన చర్యలు చేపట్టాలన్నారు. గుంటూరు రాజీవ్‌గాంధీ నగర్‌లో మానసిక దివ్యాంగురాలిపై అత్యాచార ఘటనపై,  చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌, ఏలూరు సబ్‌రిజిస్ట్రార్‌..  ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులతో ఆమె మాట్లాడారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని