అత్త 6వ రోజు కార్యక్రమంలో వంట చేస్తుండగా కోడలు సజీవ దహనం

తాజా వార్తలు

Updated : 13/09/2021 10:17 IST

అత్త 6వ రోజు కార్యక్రమంలో వంట చేస్తుండగా కోడలు సజీవ దహనం

పెదకూరపాడు(జలాల్‌పురం), న్యూస్‌టుడే: అత్త మృతి చెందడంతో ఆరో రోజు ఆచారం ప్రకారం రక్త సంబంధీకులకు పిండివంటలు పంచేందుకు వాటిని వండుతున్న క్రమంలో ప్రమాదవశాత్తూ గ్యాస్‌ లీకై కోడలు సజీవ దహనమైంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం జలాల్‌పురం గ్రామంలో ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వడ్లమూడి కమల(68) ఈ నెల 6న (సోమవారం) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ క్రమంలో ఆమె కోడలు నాగలక్ష్మి(45) బంధువులకు పంచేందుకు పిండివంటలు తయారుచేసేందుకు తోడికోడలు మల్లేశ్వరి, ఆడబిడ్డ రాధికతో కలిసి ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై ఒక్కసారిగా మంటలు ఎగసిపడి నాగలక్ష్మికి అంటుకున్నాయి. పక్కనే ఉన్న తోడికోడలు, ఆడబిడ్డ భయంతో కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. మంటలంటుకున్న నాగలక్ష్మిని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆమె సజీవ దహనమై అక్కడికక్కడే మృతిచెందారు. స్వల్ప గాయాలతో బయటపడిన తోడికోడలు మల్లేశ్వరి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెకు వైద్యసేవలు అందిస్తున్నారు. మృతురాలి భర్త భాస్కరరావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా.. ప్రస్తుతం తల్లి మృతితో వీరి ఇద్దరి కుమార్తెలు స్రవంతి, శ్రావణి అనాథలయ్యారు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని