TS News: భార్య హేళన చేసిందని బరితెగించాడు!

తాజా వార్తలు

Updated : 13/07/2021 07:08 IST

TS News: భార్య హేళన చేసిందని బరితెగించాడు!

చిన్నారులపై అభిరాందాస్‌ అఘాయిత్యాలు
దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, జవహర్‌నగర్‌: సంసారానికి పనికి రావంటూ భార్య అవహేళన చేసిందని మహిళలపై కోపం పెంచుకున్నాడు.. కామవాంఛ తీర్చాలని ఒంటరి మహిళలను వేధించేవాడు. చివరకు చిన్నారులను కాటేయడం మొదలుపెట్టాడు. ఒడిశాకు చెందిన అభిరాందాస్‌ అలియాస్‌ అభి(40)కి సంబంధించి రాచకొండ పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడకు చెందిన నాలుగేళ్ల చిన్నారిని అభి.. ఈ నెల 4న కిడ్నాప్‌ చేసి మరుసటి రోజు ప్రగతినగర్‌ నీళ్ల ట్యాంక్‌ వద్ద విడిచి వెళ్లాడు. తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ నెల 9న అదే ప్రాంతంలో మరో చిన్నారిని అపహరించేందుకు యత్నించిన అభిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. విచారించే క్రమంలో కామాంధుడి వ్యవహారశైలిని చూసి దర్యాప్తు అధికారులు కంగుతిన్నారు. నుదుటిపై తుపాకీ పెట్టి కాల్చేయాలంటూ పదే పదే అడిగాడు. ‘‘ప్రస్తుతం కీసర మండలం బండ్లగూడ 60 యార్డ్స్‌ కాలనీలో ఉంటున్న అభి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. చీకటి పడితే చాలు కామోన్మాదిగా మారేవాడు. ఆ వ్యసనం నుంచి బయటపడేందుకు డ్రగ్స్‌కు బానిసనయ్యానని.. అయినా మార్పు రాలేదని అభిరాందాస్‌ అంగీకరించాడు. ఆయన నివాసం చుట్టూ అటవీ ప్రాంతం ఉంటుంది. రాత్రి కాగానే ఒంటరిగా అటవీ మార్గంలో సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ జవహర్‌నగర్‌ పరిసర ప్రాంతాలకు వచ్చేవాడినని చెప్పాడు. ఈ ప్రాంతంపై పట్టు రావడంతో చిన్నారుల్ని కిడ్నాప్‌ చేసి ఇక్కడికే తీసుకొచ్చే వాడినని ఒప్పుకొన్నాడు’’ అని ఓ అధికారి తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని