close

తాజా వార్తలు

Published : 02/12/2020 06:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోతుల గుంపు దాడి..బాలింత మృతి

తప్పించుకునే క్రమంలో కిందపడడంతో తలకు గాయాలు
అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ముగ్గురు చిన్నారుల తల్లి

మద్దిరాల గ్రామీణం, న్యూస్‌టుడే: రెండు నెలల బాలుడికి అప్పుడే పాలిచ్చి ఊయలలో పడుకోబెట్టింది ఆ తల్లి. తర్వాత ఇంటి పనిలో నిమగ్నమైంది. ఇంతలో ఓ కోతుల గుంపు వచ్చి ఆమె మీద దాడి చేయబోయింది. భయంతో ఇంట్లోకి పరుగుపెట్టే క్రమంలో ఆ ఇల్లాలు జారిపడిపోగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం అడివెంల గ్రామానికి చెందిన దోమల శ్రీలత(23)కు నాలుగేళ్ల బాలుడు, రెండేళ్ల పాప ఉన్నారు. మూడో కాన్పు కోసం కుక్కడంలో తన పుట్టింటికి వచ్చింది. రెండు నెలల క్రితం బాలుడు జన్మించాడు. మంగళవారం జరిగిన హఠాత్పరిణామంలో ఆమె ప్రాణాలు విడవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిని కోల్పోయిన ముగ్గురు పిల్లలను చూసి స్థానికులు, బంధువులు కంటతడి పెట్టారు. భర్త సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సాయిప్రశాంత్‌ తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన