మద్యం మత్తులో భర్త ఘాతుకం

తాజా వార్తలు

Updated : 17/11/2020 09:17 IST

మద్యం మత్తులో భర్త ఘాతుకం

భార్యను చంపి ఆపై నిప్పంటించిన వైనం

వికారాబాద్‌: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి భార్యను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని డీజిల్‌ పోసి నిప్పటించాడు. కాలిన దేహాన్ని మూటగట్టి ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి అనంతగిరి అటవీ ప్రాంతంలోని వంతెన కింద పడవేసి ఏమీ ఎరుగనట్లుగా వచ్చాడు. తన భార్య కనిపించడం లేదని పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా, వికారాబాద్‌ పట్టణం రాజీవ్‌ గృహకల్ప సమీపంలో సోమవారం వెలుగు చూసింది. సీఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌ గృహ కల్ప సమీపంలో నివాసం ఉండే బానాల ప్రభుకు 2007లో సంతోష(32)తో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు విజయ్‌, సన్నీ, జంపన్న, కూతురు సారిక సంతానం. గాడిద పాలు అమ్ముకొని జీవించే ప్రభు నిత్యం మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న భార్యతో గొడవపడి తీవ్రంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డీజిల్‌ పోసి నిప్పంటించాడు. దాన్ని సంచిలో చుట్టి ట్రాలీ ఆటోలో బుగ్గ రామేశ్వరం మీదుగా కెరేళ్లి మార్గంలో ఉన్న లోతువాగు వంతెన కింద పడేశాడు. 12న తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేసినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులకు మెల్లమెల్లగా భర్తపై అనుమానం బలపడగా, ఈ నెల 15న స్థానిక కౌన్సిలర్‌ నర్సిములు దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పాడు. దీంతో కౌన్సిలర్‌ పోలీసులకు సమాచారం అందించి ప్రభును అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని