close

తాజా వార్తలు

Published : 25/10/2020 07:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యాప్‌లో చూస్తూ.. పందేలు కాస్తూ..

బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు

విజయవాడ: బెజవాడలో బెట్టింగ్‌ దందాను నిర్వహిస్తున్న మరో ముఠా గుట్టురట్టయ్యింది. ఎవరికీ అనుమానం రాకుండా స్నేహితుడి ఇంట్లో ఉంటూ.. ఆన్‌లైన్‌లో పందేలు నిర్వహిస్తున్న క్రికెట్‌ బుకీలను టాస్క్‌ఫోర్సు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శనివారం దిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య శనివారం జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌పై పందేలు కాస్తున్నట్టు అందిన సమాచారంతో ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ-1 హర్షవర్దన్‌రాజు వివరాలను వెల్లడించారు.

ఓ ఆన్‌లైన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న బెట్టింగ్‌ నిర్వాహకులు అందులో ఉండే మ్యాచ్‌ రేటింగ్స్‌ను చూస్తుంటారు. టీవీలో కనిపించే స్కోర్‌ కంటే.. యాప్‌లో కాస్త ముందస్తు వివరాలు లభ్యమవుతాయి. దీంతో నిర్వాహకులు యాప్‌తో పాటు.. టీవీని చూస్తూ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడైన కళ్యాణ్‌చక్రవర్తి ఫోన్‌లు రిసీవ్‌ చేసుకుని ఫంటర్లు చెప్పే రేట్లను, వారి పేర్లను నమోదు చేసుకుంటుండగా.. కృష్ణలంకు చెందిన మూలి కేశవరెడ్డి కమ్యూనికేటర్‌ బాక్స్‌లో ఉన్న మైక్‌ ద్వారా మ్యాచ్‌ రేటింగ్స్‌ను కామెంట్రీలా చెబుతున్నాడు. ఈ సమయంలో సబ్‌బుకీలు చెప్పిన బెట్టింగ్‌ వివరాలు, వారి పేర్లను రవికిరణ్‌ ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌లో నమోదు చేస్తున్నాడు. ఫంటర్లకు సంబంధించిన లావాదేవీలన్నీ రామవరప్పాడుకు చెందిన కోడూరి చంద్రశేఖర్‌ చూసుకుంటున్నాడు. ఈ తతంగం జరుగుతున్నప్పుడే విజయవాడ టాస్క్‌ఫోర్సు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర దొరికిన సమాచారంతో ఆకివీడుకు చెందిన రావెళ్ల శ్రీనివాసరావు, మొగల్రాజపురానికి చెందిన పటమట సుధాకర్‌, సనత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఖలీలుల్లా, బావాజీపేటకు చెందిన పిల్ల శివశంకర్‌, గుంటూరు జిల్లా పెదవడ్లమూడికి చెందిన పోతినేని కుటుంబరావులను అరెస్టు చేశారు.. వారి దగ్గర నుంచి రూ.7,50,000 నగదు, 20 ఫోన్లు ఉన్న కమ్యూనికేటర్‌ బాక్స్‌-1, టీవీ-1, ల్యాప్‌టాప్‌-1, సెల్‌ఫోన్లు-13 స్వాధీనం చేసుకున్నారు.

పట్టించిన.. గత చరిత్ర

ప్రస్తుతం ఐపీఎల్‌ జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు బెట్టింగ్‌ నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. 2018లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ పట్టుబడిన విజయవాడకు చెందిన వీరపనేని కల్యాణ్‌చక్రవర్తి మళ్లీ పందేలకు పాల్పడుతున్నాడని గుర్తించి అతని కదలికలపై నిఘా పెట్టారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మురళీనగర్‌లో నివాసముంటున్న కల్యాణ్‌ చక్రవర్తికి అతని స్నేహితుడు కంభంపాటి రవికిరణ్‌ తన ఇంట్లోని మూడో అంతస్తులో గదిని బెట్టింగ్‌ నిర్వహణకు ఇచ్చాడు. పక్కా సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని డీసీపీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. ఎవరైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే.. పోలీస్‌ వాట్సప్‌ నెంబర్‌ 7328909090, డయల్‌ 100కి ఫోన్‌ చేయాలని కోరారు. ఈ కేసులో ప్రతిభ చూపిన టాస్క్‌ఫోర్సు ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీలు వర్మ, కృష్ణమోహన్‌, సిబ్బందిని ఆయన అభినందించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.