close

తాజా వార్తలు

Updated : 21/10/2020 08:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిస్కెట్‌ ఇచ్చి ఊపిరి తీశాడు!

చిన్నారి హత్య కేసులో నిందితుడి అరెస్టు


నిందితుడి అరెస్టు చూపుతున్న సీఐ మల్లేశ్వరరావు, ఎస్సై

చింతలపూడి గ్రామీణ, లింగపాలెం: అభం శుభం తెలియని ఓ చిన్నారి పాలిట బంధువే కాలయముడయ్యాడు. చెవిదిద్దులను అపహరించే ప్రయత్నంలో బాలిక ఉసురు తీశాడు. చింతలపూడి స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం తోచిలకరాయుడుపాలెం గ్రామానికి చెందిన విస్సంపల్లి అంజలి (8) ఈ నెల 14న ఉదయాన్నే ఆటలాడుతూ బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో బాలికకు వరుసకు మేనమామ అయిన కాట్రు వంశీ అలియాస్‌ బన్ను ఆమె ధరించిన చెవిదిద్దులను చూశాడు. క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ.2 వేలు మరో వ్యక్తికి ఇవ్వాల్సి ఉండటంతో దిద్దులను కాజేసి అప్పు తీర్చాలని భావించాడు. తరువాత ఆ చిన్నారిని పిలిచి బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనిచ్చాడు. అనంతరం రూ.100 నోటు ఇచ్చి సిగరెట్లు, అగ్గిపెట్టె తేవాలని దుకాణానికి పంపాడు. తాను సమీపంలో ఉన్న పాత ఇంటి వద్ద ఉంటానని చెప్పడంతో ఆ బాలిక సిగరెట్లు, అగ్గిపెట్టె తీసుకుని అక్కడికి వెళ్లింది. నిందితుడు ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి చెవి దిద్దులను అపహరించేందుకు ప్రయత్నించగా ఆమె పెద్దగా కేకలు వేసింది. దీంతో దిండుతో నోటిపై గట్టిగా నొక్కడంతో ఆ బాలిక ఊపిరాడక మృతి చెందింది. ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లిన పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరకు పాత ఇంట్లో ఆ చిన్నారి విగతజీవిగా కనిపించింది. దీనిపై గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ తెలిపారు. పోలీసు జాగిలం, క్లూస్‌టీం సేకరించిన ఆధారాలను బట్టి నిందితుడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

నిందితుడు వంశీ చిన్న వయసులోనే తాగుడుతో పాటు బెట్టింగ్‌కు బానిసైనట్లు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. గతంలో ద్విచక్రవాహనం చోరీ చేసినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నట్లు చెప్పారు. బెట్టింగ్‌కు అలవాటుపడ్డ వంశీ డబ్బు కోసం ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుడిని చింతలపూడి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ధర్మారావు నవంబరు 3 వరకు రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.