close

తాజా వార్తలు

Updated : 21/09/2020 08:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మను ఏం చేస్తాడోనని అన్నను చంపిన చెల్లి

ఫిరంగిపురం గ్రామీణం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో అమ్మను కొట్టబోతున్నాడని చెల్లి అన్న తలపై రోకలి బండతో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఫిరంగిపురం ఇన్‌ఛార్జి సీఐ కరుణాకరరావు, ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిరంగిపురం మండలం రేగులగడ్డ గ్రామానికి చెందిన గుంజి సాంబయ్య-నాగమ్మ దంపతులకు పోతురాజు, ఆదిలక్ష్మి ఇద్దరు సంతానం. పోతురాజు (40)కు సత్తెనపల్లి మండలం గార్లపాడుకు చెందిన వీరమ్మతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అతను మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి ఆమె పుట్టింటికి వెళ్లగా ఆయన తల్లి వద్దే ఉంటున్నాడు. ఆదిలక్ష్మికి అమరావతి మండలం అత్తలూరుకు చెందిన తిరులకొండ నాగరాజుతో వివాహమైంది. వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. పోతురాజు మద్యం తాగి వచ్చి రోజూ ఇంట్లో ఉన్న తల్లిని, చెల్లిని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. తల్లిని ఆస్తి తనకు రాసివ్వమని ఒత్తిడి చేసేశాడు. ఈ క్రమంలో ఆదివారం ఆస్తి విషయమై తల్లీ కుమారుడి మధ్య వివాదం చోటుచేసుకుని మాటా మాటా పెరిగింది. అతను తల్లిపై దూకుడుగా వ్యవరిస్తుండగా అమ్మను అన్న ఏమి చేస్తాడోననే భయంతో పక్కనే ఉన్న ఆదిలక్ష్మి రోకలి బండతో పోతురాజు తలపై కొట్టింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇన్‌ఛార్జి సీఐ, ఫిరంగిపురం ఎస్‌ఐలు తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. జరిగిన సంఘటన వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.