close

తాజా వార్తలు

Published : 20/09/2020 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బావను హతమార్చేందుకు సుపారీ

రూ.5 లక్షలు ఇచ్చిన కానిస్టేబుల్‌ ● గుట్టురట్టు చేసిన పోలీసులు

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: చెల్లిని వదిలేశాడన్న కోపంతో బావను హతమార్చడానికి ఓ కానిస్టేబుల్‌ పథకం రచించాడు. పోలీసులు గుట్టును ముందుగానే రట్టుచేసి నలుగురిని అరెస్టు చేశారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. రాజేంద్రనగర్‌ ఠాణా ఎస్సై విఠల్‌రెడ్డి వివరాల మేరకు.. సులేమాన్‌నగర్‌లో నివసించే షౌకత్‌(40) రాయదుర్గం ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన చెల్లి వివాహం మహబూబ్‌నగర్‌కు చెందిన జాకెర్‌తో జరిగింది. విభేదాల కారణంగా అతడు భార్యను వదిలేశాడు. సంవత్సరం క్రితం మరో వివాహం చేసుకున్నాడు. తన చెల్లిని వదిలిపెట్టి మరో వివాహం చేసుకున్నాడని షౌకత్‌ బావపై కోపం పెంచుకున్నాడు. అతన్ని ఎలాగైనా హత మార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకు హసన్‌నగర్‌కు చెందిన సాజిద్‌(37)తో రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సాజిద్‌ తనకు సహాయంగా అస్లంఖాన్‌(22), షఫీ(45)తో పాటు శిఖాతో కలిసి జాకెర్‌ను హత్య చేయాలని పథకం రచించాడు. ఈనెల 8వ తేదీన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలోని శివరాంపల్లిలో జావెద్‌ అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు హత్యచేశారు. ఈ హత్యకు సంబంధించిన నిందితులను పోలీసులు విచారిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ బావను హత్యచేయడానికి రూ.5లక్షలతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని ఓ నిందితుడు పోలీసులకు తెలిపాడు. అతను ఇచ్చిన సమాచారం మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు షౌకత్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. షౌకత్‌తో పాటు సాజిద్‌, అస్లంఖాన్‌, షఫీని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శిఖా అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.