close

తాజా వార్తలు

Updated : 07/07/2020 08:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తాగొచ్చి మనవడి వేధింపులు..నిప్పంటించిన అమ్మమ్మ

చికిత్స పొందుతూ మృతి

బాలాపూర్‌: మనవడు నిత్యం తాగొచ్చి వేధిస్తుండటంతో విసిగిన అమ్మమ్మ అతనిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించగా.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి   జిల్లా మీర్‌పేట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌ఛార్జి సీఐ జగన్నాథం కథనం ప్రకారం.. మీర్‌పేట హుడా కాలనీలో ఉండే వి.కృష్ణ (40) కూలి పనిచేస్తుంటాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన కృష్ణ నిత్యం మద్యం తాగి భార్యాపిల్లలను వేధించేవాడు. భార్యా పిల్లలు నాలుగేళ్ల క్రితం అతడ్ని వదిలేసి వెళ్లారు. అప్పట్నుంచి కృష్ణ తన అమ్మమ్మ వెంకమ్మ (75) వద్ద ఉంటున్నాడు. భార్యాపిల్లలు విడిచిపెట్టి వెళ్లినా అతడిలో మార్పు రాలేదు. నిత్యం తాగొచ్చి అమ్మమ్మను తిట్టడం, కొట్టడం, డబ్బులు లాక్కొని  తాగడం చేసేవాడు. ఈ విషయమై అతడిని సోదరి బాలమణి, చిన్నమ్మ ఎల్లమ్మలు సైతం మందలించారు. ఆదివారం రాత్రి కూడా కృష్ణ బాగా తాగొచ్చి అమ్మమ్మను వేధించాడు. బాలమణి, ఎల్లమ్మల సహకారంతో మనవడిని వెంకమ్మ కట్టేసి.. అతనిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలైన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని