close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏమైందో...ఏమో....?

వివాహిత బలవన్మరణం

డెంకాడ: మోదవలస పంచాయతీ గొండయ్యపాలేనికి చెందిన వివాహిత ఎర్నింటి మౌనిక (21) ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆమె మేనకోడలు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను చికిత్స నిమిత్తం విజయనగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్‌ఐ బి.సాగర్‌బాబు తెలిపారు. ఎర్నింటి గౌరయ్యకు మౌనికతో రెండేళ్ల కిందట వివాహమైంది. దంపతుల మధ్య ఎటువంటి గొడవలు లేవని, కాపురం సజావుగానే సాగిందని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటో తెలియడం లేదని వారు చెబుతున్నారు. మౌనిక ప్రస్తుతం మూడు నెలల గర్భవతి.తహసీల్దారు చంద్రమౌళి సమక్షంలో సోమవారం శవపంచనామా నిర్వహించి మృతదేహానికి జిల్లా కేంద్రాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు.ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని