గ్యాంగ్‌వార్‌ కేసులో మరో ఆరుగురు అరెస్టు
close

తాజా వార్తలు

Published : 07/07/2020 07:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గ్యాంగ్‌వార్‌ కేసులో మరో ఆరుగురు అరెస్టు

పటమట: పటమటలో బహిరంగ స్థలంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌ కేసులో మరో ఆరుగురు నిందితులను పటమట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పటమట తోటవారి వీధికి చెందిన పురం చైతన్య అలియాస్‌ బుడ్డి (26), కానూరు వసంత్‌నగర్‌కు చెందిన మాచర్ల సాగర్‌ (24), పటమట డొంక రోడ్డుకు చెందిన పులగం జూసి ప్రభుకాంత్‌ (29), యనమలకుదురు ఇందిరానగర్‌-1కు చెందిన కందుల అనిల్‌ కుమార్‌ (27), పటమట పోస్టల్‌ కాలనీకి చెందిన ఎర్రంశెట్టి ఆదిశేషు (21), పటమట రెల్లీస్‌ కాలనీకి చెందిన ముత్యాల కుమారస్వామి అలియాస్‌ చంబు (19)ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఐదు సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటికే జూన్‌ 5న తోట సందీప్‌ హత్య కేసులో 13 మందిని, జూన్‌ 8న కొండూరు మణికంఠ అలియాస్‌ పండుపై హత్యాయత్నం కేసులో 11 మందిని, జూన్‌ 10న మరో 9 మందిని, 13న ప్రధాన నిందితుడు కొండూరు మణికంఠ అలియాస్‌ పండును అరెస్టు చేశారు. జూన్‌ 14న కొట్లాటకు, రెండు కేసులకు కారణమైన మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు డీసీపీ హర్షవర్థన్‌రాజు ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఏసీపీ పి.నాగరాజారెడ్డి పర్యవేక్షణలో పటమట సీఐ రావి సురేష్‌రెడ్డిలు ఈ కేసులకు సంబంధించి నిందితులను అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని