పుణెలో రూ.87కోట్ల నకిలీనోట్లు స్వాధీనం

తాజా వార్తలు

Updated : 11/06/2020 13:11 IST

పుణెలో రూ.87కోట్ల నకిలీనోట్లు స్వాధీనం

పుణె: పుణెలోని ఎరవాడసంజయ్‌ పార్క్‌ వద్ద అంతర్జాతీయ నకిలీనోట్ల రాకెట్‌ గుట్టును  పుణె పోలీసులు, ఆర్మీ ఇంటెలిజెన్స్‌ అధికారులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న నకిలీనోట్ల మొత్తం విలువ రూ.87కోట్లుగా తేలింది. పుణె విమానాశ్రయానికి సమీపంలోని ఓ బంగ్లాలో పెద్ద  సంఖ్యలో నకిలీనోట్లు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.

భారతీయ కరెన్సీకి బదులుగా విదేశీ కరెన్సీని తీసుకోవడానికి ఒక పోలీస్‌ అధికారిని పంపారు. తద్వారా నకిలీనోట్ల రాకెట్‌ను భయటపెట్టారు. బంగ్లా నుంచి ఒక కెమెరా, రెండు తుపాకులు, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, ప్రింటింగ్‌ మెషీన్‌ ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోట్లన్నీ బంగ్లాలో కట్టలు కట్టలుగా పేర్చి ఉన్నాయి. ఈ కేసులో ఆర్మీ అధికారి సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. కొందరు వ్యక్తులతో కలిసి ఆర్మీ అధికారి నకిలీ నగదును డాలర్లుగా మారుస్తున్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని