కత్తిపై తూలిపడి దుర్మరణం
close

తాజా వార్తలు

Published : 02/04/2020 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కత్తిపై తూలిపడి దుర్మరణం

హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి మృతి

రాఘవాపురం (చింతలపూడి గ్రామీణ), న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు కత్తిపై తూలిపడటంతో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన నేలకూరి రవీంద్రనాథ్‌ (56) భార్య రోజ్‌మేరీతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన బుధవారం ఉదయం కూరగాయలు తరుగుతుండగా ముందుకు తూలిపడ్డారు. ఈ క్రమంలో కత్తి ఆయన ఛాతీలో లోతుగా దిగింది. దీనిని చూసిన భార్య రోజ్‌మేరీ కేకలు వేయగా పోలీసులు, ఏఎన్‌ఎంలు వచ్చి అతడిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా అరగంటకు వాహనం వచ్చింది. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో రవీంద్రనాథ్‌ మృతి చెందారు. ఈ ఘటనపై చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. .

సమయానికి వైద్యం అందక.. గత నెల 18న రాఘవాపురంలో విందుకు హాజరైన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ క్రమంలో ఆ వేడుకలో పాల్గొన్న వారందరినీ అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. మృతుడు రవీంద్రనాథ్‌తో పాటు చుట్టుపక్కల నివాసితులు హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. రవీంద్రనాథ్‌కు కత్తి గుచ్చుకుని దాదాపు అరగంట సేపు కొట్టుమిట్టాడినా స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి ప్రాథమిక చికిత్స అందించే అవకాశం లేకుండా పోయింది. సమయానికి వైద్యం అందితే రవీంద్రనాథ్‌ బతికేవారని స్థానికులు చెబుతున్నారు.

వదంతలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు: రవీంద్రనాథ్‌ ప్రమాదవశాత్తు మృతిచెందగా, అతడు కరోనా సోకి చనిపోయినట్లు కొందరు వదంతులు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఎంపీడీవో మణికుమారి తెలిపారు. ప్రజలను భయందోళనలకు గురిచేసేలా వదంతులను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని