రెండు కార్గో రైళ్లు ఢీ.. ముగ్గురి మృతి

తాజా వార్తలు

Updated : 01/03/2020 14:45 IST

రెండు కార్గో రైళ్లు ఢీ.. ముగ్గురి మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గును మోసుకెళ్తున్న రెండు కార్గో రైళ్లు సింగ్రౌలీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో లోకోపైలట్‌ సహా మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. రంగంలోకి దిగిన ఎన్‌టీపీసీ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని