
తాజా వార్తలు
ఉరేసుకొని సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య
గచ్చిబౌలి: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్.ఐ. రమేష్ వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని చందానగర్ ప్రాంతానికి చెందిన అగ్నిశ్వర్ చక్రవర్తి(30) కొండాపూర్‌లోని ప్రశాంత్‌నగర్ కాలనీలో స్నేహితుడు సప్తర్షి ముఖర్జీతో నివసిస్తూ స్థానికంగా ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. రెండురోజుల క్రితం సప్తర్షి వైజాగ్ వెళ్లాడు. అయితే అగ్నిశ్వర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని కోల్‌కతాలో ఉంటున్న అతని సోదరి ఆదివారం సప్తర్షికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో సప్తర్షి సోమవారం ఉదయం ఫ్లాట్ వచ్చి చూడగా తలుపులు తీయలేదు. పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి తలుపులు విరగ్గొట్టి లోపలి వెళ్లి చూశారు. అగ్నిశ్వర్ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు.