ఫేస్‌‘బుక్‌ చేస్తాడు’

తాజా వార్తలు

Updated : 19/02/2020 08:51 IST

ఫేస్‌‘బుక్‌ చేస్తాడు’

బంగారం వ్యాపారినంటూ మాయమాటలు
పరిచయం పెరిగాక మహిళలకు వేధింపులు
వంద మందిని వేధించిన వ్యక్తి అరెస్టు

కొండపి: ఫేస్‌బుక్‌ ద్వారా మహిళల సమాచారం సేకరిస్తాడు. వారి ఫోన్‌ నంబర్లు తెలుసుకుని మాట కలుపుతాడు. బంగారం వ్యాపారినంటూ ఆశ చూపుతాడు. వలలో పడ్డాక అసలు రంగు బయటపెడతాడు.. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వంద మంది మహిళలను వేధించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం కలవళ్లకు చెందిన మోదేపల్లి నరేష్‌(25) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేసేవాడు. ఫేస్‌బుక్‌లో మహిళల సమాచారం సేకరించి ఫోన్‌నంబర్లు తెలుసుకుని..వాట్సాప్‌లో సందేశాలు పంపేవాడు. బంగారు దుకాణం ఉందంటూ ఆభరణాల చిత్రాలను పంపేవాడు. ఇలా వాట్సాప్‌ చాటింగ్‌లో సాన్నిహిత్యం పెరిగాక.. తన నగ్నచిత్రాలు మహిళలకు పంపేవాడు. వారి నగ్న చిత్రాలనూ పంపాలంటూ మహిళలను వేధించేవాడు. బంగారు నగలు ఇస్తానంటూ నమ్మించి.. మోసపోయిన మహిళల నగ్నచిత్రాలు సేకరించి.. వాటి నెట్‌లో పెడతానంటూ బెదిరించేవాడు. ఇలా సుమారు 100 మంది మహిళలు అతని ఉచ్చులో పడినట్లు తేలింది. కె.ఉప్పలపాడుకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సింగరాయకొండ సీఐ యూ.శ్రీనివాసులు, ఎస్సై ఎన్‌సీ ప్రసాద్‌ చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. ఎప్పటికప్పుడు నిందితుడు తన ఫోన్‌నంబర్‌తోపాటు, ఐఎంఈఐ సంఖ్యను మారుస్తుండటంతో అతని కోసం నెలరోజులపాటు గాలించారు. అతని ఫోన్‌లో మహిళల ఫోన్‌నంబర్లే ఎక్కువగా ఉండటంతో పోలీసులు నిర్ఘాంతపోయారు. మహిళలకు పంపిన సందేశాలను, ఇతర సమాచారాన్ని సేకరించారు. నరేష్‌ మీద సెక్షన్‌ 354(ఎ), 354(డి), ఐపీసీ509, సెక్షన్‌67(ఎ) ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నందుకు పోలీసులను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని