కేటీఆర్‌ పీఏనంటూ మోసం:మాజీక్రికెటర్‌ అరెస్టు 

తాజా వార్తలు

Published : 16/02/2020 00:39 IST

కేటీఆర్‌ పీఏనంటూ మోసం:మాజీక్రికెటర్‌ అరెస్టు 

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న మాజీ రంజీ క్రికెటర్‌ నాగరాజును సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు అనేవ్యక్తి కేటీఆర్‌ పీఏ తిరుపతి రెడ్డిగా చెప్పుకొంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. గతేడాది ఒక కంపెనీ ఎండీకి మాయ మాటలు చెప్పి రూ.3.5లక్షలు వరకు కాజేశాడు. ఫిబ్రవరిలో సీఎంగా కేటీఆర్‌ ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి స్పాన్సర్‌ ఇప్పిస్తానంటూ యువకుడు మరోసారి ఫోన్‌ చేశాడు. అనుమానంతో ఆరా తీసిన కంపెనీ ఎండీ నాగరాజుపై అనేక కేసులు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని