నమ్మించి వంచించాడు.. రూ.కోట్లతో ఉడాయించాడు

తాజా వార్తలు

Published : 05/01/2020 06:44 IST

నమ్మించి వంచించాడు.. రూ.కోట్లతో ఉడాయించాడు

 

తక్కువ ధరలకే ఫ్లాట్లంటూ టోకరా

హైదరాబాద్‌: తక్కువ ధరలకే అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లు, దుకాణ సముదాయాలు అంటూ వలవేశాడు.. అవసరం మేరకు తానే బ్యాంక్‌ రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు.. అడ్వాన్సు రూపంలో ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలో దండుకుని తీరా బిచాణా ఎత్తేసిన ఓ ప్రబుద్ధుడి ఉదంతం సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. బాధితుల్లో విశ్రాంత ఉద్యోగులు, స్నేహితులు, సన్నిహితులూ ఉండటం గమనార్హం. బాధితుల వివరాల ప్రకారం.. కాచిగూడ ప్రాంతానికి చెందిన నిమీత్‌ కపాసీ కుత్బిగూడలో మెడికల్‌ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నాడు. తక్కువ ధరలకే అపార్టుమెంట్లలో ఫ్లాట్లు, దుకాణ సముదాయాలు ఇప్పిస్తానని, బ్యాంక్‌ రుణాలు సమకూరుస్తానని పలువురిని నమ్మించాడు. దాదాపు 25కుపైగా బాధితుల వద్ద ఒక్కొక్కరినుంచి రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేశాడు. తీరా భార్యతో కలిసి పరారయ్యాడు.  నిమీత్‌ కనిపించకపోవడంతో బాధితులు తాజాగా సీసీఎస్‌ను ఆశ్రయించారు. అక్కడి అధికారుల సూచన మేరకు సుల్తాన్‌బజార్‌ పోలీసులను ఒక్కొక్కరుగా ఆశ్రయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని