విద్యుత్‌ లైన్‌కు తగిలిన బస్సు.. ఐదుగురి మృతి!

తాజా వార్తలు

Updated : 13/01/2021 05:58 IST

విద్యుత్‌ లైన్‌కు తగిలిన బస్సు.. ఐదుగురి మృతి!

చెన్నై: తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు విద్యుత్‌ లైన్‌పైకి దూసుకెళ్లడంతో.. పుట్‌బోర్డులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంజావూర్‌ జిల్లా తిరువయ్యూర్‌లో కల్లనై నుంచి మన్నార్‌గుడికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అకస్మాత్తుగా రహదారి నుంచి అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్‌ లైన్‌ను ఢీకొట్టింది. దీంతో ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్న వారిలో ఐదుమంది విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో ముగ్గురిని వరకూర్‌ ప్రాంతానికి చెందిన కల్యాణరామన్‌(55), గణేశన్‌(50), నాదరాజన్‌(45)లుగా గుర్తించారు. బస్సులో ఉన్న వారిలో పది మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి..

కల్తీ మద్యానికి 11 మంది బలిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని