close

తాజా వార్తలు

Updated : 17/01/2021 14:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బస్సు దగ్ధం: ఎనిమిది మంది సజీవదహనం

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని జాలోర్‌ జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో డ్రైవర్‌, క్లీనర్‌తో సహా ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భక్తులతో బార్మెర్‌ నుంచి అజ్మీర్‌లోని బేవార్‌కు వెళుతున్న బస్సు.. మహేశ్‌పుర గ్రామంలోకి ప్రవేశించిన సమయంలో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా వేలాడుతున్న విద్యుత్తు తీగను బస్సు తాకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో క్షణాల్లోనే వాహనమంతటికీ మంటలు వ్యాపించాయి. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని జోధ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక ఎస్పీ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే ఆస్కారం ఉన్నట్లు వివరించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.  


ఇవీ చదవండి..
ప్రేయసిని చంపి.. గోడలో దాచి..

వికారాబాద్‌లో తూటా కలకలం




Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని