ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

తాజా వార్తలు

Updated : 12/07/2021 04:06 IST

ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

తాళ్లపూడి: పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని వేగేశ్వరపురంలో ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి తన కుమార్తె (9), కుమారుడి (7)తో కలిసి ద్విచక్రవాహనంపై గోదావరి ఒడ్డుకు వచ్చారు. వారితో తీసుకొచ్చుకున్న అల్పాహారాన్ని తినేసి కాసేపు అక్కడే గడిపారు. కాసేపటి తర్వాత ఒక్కసారిగా తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకేశాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తాళ్లపూడి ఎస్‌ఐ సతీష్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు, గజ ఈతగాళ్ల  సాయంతో గాలింపు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న ద్విచక్రవాహనం నంబర్‌ ఆధారంగా వివరాలు పరిశీలించగా.. భీమవరానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని