ఫోన్‌ కోసం కొవిడ్‌ రోగిని చంపేశారు!

తాజా వార్తలు

Published : 17/06/2021 01:48 IST

ఫోన్‌ కోసం కొవిడ్‌ రోగిని చంపేశారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: డబ్బు, సెల్‌ఫోన్‌ కోసం కొవిడ్‌ రోగిని దారుణంగా హత్య చేసిన ఘటన చెన్నైలోని ఓ ప్రభుత్వ కొవిడ్‌ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరువొట్టియూర్‌కు చెందిన 40 ఏళ్ల రతీ దేవి చెన్నై ప్రభుత్వం ఆసుపత్రిలో ఒప్పంద ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మే 23నే కొవిడ్‌ సోకిన సునీత అనే గృహిణి చికిత్స తీసుకోవడానికి అదే ఆసుపత్రిలో చేరారు. బాధితురాలి వద్ద నగదు చూసిన రతీదేవి తన అవసరాల నిమిత్తం వాటిని కాజేయాలనుకుంది. పక్కా ప్రణాళికతో సునీతను ఆసుపత్రి చివరి అంతస్థుకు తీసుకువెళ్లి కిరాతకంగా గొంతుకోసి హత్యచేసి, అమె దగ్గరున్న డబ్బు, సెల్‌ఫోన్‌ను కాజేసింది. జూన్‌ 8న జరిగిన ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌చేసి, అమె వద్ద నుంచి డబ్బు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని