close

తాజా వార్తలు

పెట్రోల్‌ బంక్‌ సమీపంలో కారు దగ్ధం

హైదరాబాద్‌: నగరంలోని ఎల్‌బీ నగర్‌ పరిధి హస్తినాపురం వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నాగార్జునసాగర్‌ వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై కారులో దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత కారు పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద స్థలికి దగ్గర్లోనే పెట్రోల్‌ బంకు ఉంది. ఒకవేళ మంటలు అటుగా వ్యాపించి ఉంటే పెను ప్రమాదమే జరిగేదని స్థానికులు తెలిపారు.

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.