డ్రెయిన్‌లో కొట్టుకుపోయి బాలుడు మృతి

తాజా వార్తలు

Published : 28/06/2021 01:09 IST

డ్రెయిన్‌లో కొట్టుకుపోయి బాలుడు మృతి

గుంటూరు: గుంటూరులో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల డ్రెయిన్‌లో కొట్టుకుపోయిన ఐదేళ్ల బాలుడు శవమై తేలాడు. గుంటూరు నగరంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలోని డ్రెయిన్లు పొంగిపొర్లాయి. మెడికల్ క్లబ్ పరిసరాల్లోని పీకల వాగు కూడా పొంగింది. శివరాంనగర్‌కి చెందిన పుల్లయ్య, మంగమ్మల రెండో కుమారుడు పీకల వాగు ఒడ్డున ఆడుకుంటున్నాడు. అక్కడే ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు డ్రెయిన్‌లో పడి ప్రవాహధాటికి కొట్టుకుపోయాడు. విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలుడి ఆచూకీ కోసం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. నగర మేయర్ కావటి మనోహర్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఈరోజు సంపత్ నగర్ వద్ద బాలుడు మృతదేహం లభ్యమైంది. బాలుడి మృతి వార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని