close

తాజా వార్తలు

Updated : 23/01/2021 06:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమ పేరుతో ఉన్మాది ఘాతుకం

ప్రొద్దుటూరు, నేర వార్తలు: కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రేమ పేరుతో ఉన్మాది రెచ్చిపోయాడు. వివేకానంద కాలనీకి చెందిన సునీల్‌ అనే యువకుడు తనను ప్రేమించలేదన్న కారణంతో నేతాజీ నగర్‌కు చెందిన యువతి(17)పై దాడికి తెగబడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో   కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో యువతి తల భాగం, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. చేతివేళ్లు కొన్ని తెగిపోయాయి. అప్రమత్తమైన స్థానికులు బాధితురాలిని హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీఐ నాగరాజు, ఎస్సై శివశంకర్‌లు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. సునీల్‌ గత 3 నెలలుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. 

ఇవీ చదవండి..

రూ.50 అప్పు... ప్రాణం తీసింది

శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి




Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని