AP News: ప్రేమ‌జంట‌పై అఘాయిత్యం

తాజా వార్తలు

Updated : 20/06/2021 16:33 IST

AP News: ప్రేమ‌జంట‌పై అఘాయిత్యం

తాడేప‌ల్లి: గుంటూరు జిల్లా తాడేప‌ల్లి ప‌రిధిలోని సీతాన‌గ‌రంలో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పుష్క‌ర‌ఘాట్‌లోని ఇసుకలో కూర్చుని ఉన్న‌ ప్రేమ‌జంట‌పై దాడి జ‌రిగింది. యువ‌కుడిని తాళ్ల‌తో క‌ట్టేసిన ఇద్ద‌రు దుండ‌గులు.. ఆపై యువ‌తిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఘ‌ట‌న‌పై ఈ తెల్ల‌వారుజామున బాధితులు తాడేప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి గురైన యువ‌తిని చికిత్స కోసం పోలీసులు ఆస్ప‌త్రికి త‌రలించారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. న‌లుగురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని