అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం

తాజా వార్తలు

Published : 26/10/2020 01:04 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌లో లారీ బీభత్సం

అబ్దుల్లాపూర్‌మెట్ (హైదరాబాద్‌): నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ కూడలిలో ఓ ట్యాంకర్‌ లారీ అదుపుతప్పి ఇతర వాహనాలను తప్పిస్తూ రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈప్రమాదంలో ట్యాంకర్‌ లారీ నుంచి ఇంధనం లీకవడంతో అగ్నిప్రమాదం జరుగుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శకటాన్ని రప్పించారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాలయ్యాయి. లారీ జాతీయ రహదారిపై కాకుండా కవాడిపల్లి మార్గంలో బోల్తాపడటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని