close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 22/01/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పోలీసు... పాల దొంగతనం...

లఖ్‌నవూ: నిరసన చేస్తున్న మహిళల నుంచి స్వాధీనం చేసుకున్న దుప్పట్లను స్వాహా చేస్తూ ఓ లఖ్‌నవూ పోలీసు కెమేరా కంటికి చిక్కిన ఘటనను మరువక ముందే ఉత్తర్‌ ప్రదేశ్‌లో మరో పోలీసు హస్తలాఘవం బయటపడింది. వివరాల్లోకి వెళితే... నొయిడా ప్రాంతంలో ఒక పోలీసు పాల పాకెట్లను దొంగతనం చేస్తున్న వీడియో ఈ మధ్య సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో పెట్రోలింగ్‌ విధుల్లో ఉన్న పోలీసు పాలప్యాకెట్లు ఉన్న క్రేట్ల సమీపంలో తిరుగుతూ ఉన్నాడు. కొంతసేపటి తరువాత అతను వాటిలోంచి రెండు ప్యాకెట్లు తీసుకుని దగ్గరలో ఉన్న పోలీసు వాహనం వైపు వెళ్లాడు. దానిలో కూర్చుని ఉన్న తన సహోద్యోగికి ఆ ప్యాకెట్లను ఇచ్చాడు. పోలీసు చేసిన ఈ పని జనవరి 19 తెల్లవారు ఝామున సీసీ టీవీ కెమేరాలో చిక్కింది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.