close

తాజా వార్తలు

డ్యాన్స్‌ ఆపిందని.. కాల్పులు జరిపాడు

లఖ్‌నవూ: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడో వ్యక్తి. డ్యాన్స్ చేయడం ఆపేసిందని మహిళ ముఖంపై తుపాకీతో కాల్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రాకూట్‌లో గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

చిత్రకూట్‌లోని మౌర్‌ గ్రామంలో డిసెంబరు 1న ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఓ కుటుంబం కళాకారులతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఆర్టిస్టులు డ్యాన్స్‌ చేస్తుండగా ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని స్టేజ్‌ పైకి వెళ్లాడు. అతడిని చూడగానే ఆర్టిస్టులు డ్యాన్స్‌ ఆపేశారు. దీంతో ఆ వ్యక్తి.. ‘డ్యాన్స్‌ ఎందుకు ఆపారు..? చేయండి’ అంటూ తన వద్ద ఉన్న తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్టిస్టుల బృందంలోని ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. 

ఘటన సమయంలో గ్రామపెద్ద కూడా అక్కడే ఉన్నారు. ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆ మహిళ కాన్పూర్‌ ఆసుపత్రిలో కోలుకుంటోంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.