close
Array ( ) 1

తాజా వార్తలు

టీవీ చూసి... ఉరి వేసుకున్న బాలుడు

కోల్‌కతా: టీవీలో నేర సంబంధిత కార్యక్రమాలను చూసి అలాగే చేద్దామనుకున్న పదేళ్ల బాలుడు తన ప్రాణాలనే కోల్పోయాడు. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి...  రజనీకాంత సాహా అనే బాలుడు ధువాదిఘి గ్రామంలో నాల్గో తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆ బాలుడిని మాల్దా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. క్రైమ్‌ థ్రిల్లర్స్‌ అంటే వివరీతమైన ఇష్టం ఉన్న రజనీ రోజూ టీవీలో అటువంటి కార్యక్రమాలనే చూస్తూ ఉండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆ రోజు కూడా టీవీలో ఏదైనా సన్నివేశం చూసి ఇలా ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో విచారణ చేపడతామని చెప్పారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.