మోదీ కార్యాలయాన్నే అమ్మబోయారు!

తాజా వార్తలు

Published : 18/12/2020 21:53 IST

మోదీ కార్యాలయాన్నే అమ్మబోయారు!

వారణాసి: భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు దఫాలు వారణాసి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. కాగా, ఇక్కడ ఉన్న ప్రధాని కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టిన విచిత్ర సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నిందితులు పట్టణంలోని జవహర్‌నగర్‌ కాలనీలో ఉన్న మోదీ ప్రజా సంబంధాల కార్యాలయం ‘‘జనసంపర్క్‌ కార్యాలయ్‌’’  చిత్రాన్ని అన్‌లైన్‌ విక్రయ ప్లాట్‌ఫాం ఓఎల్‌ఎక్స్‌లో ఉంచారు.  అంతేకాకుండా దానిని రూ.7.5 కోట్లకు విక్రయిస్తామని ప్రకటించారు.

ఈ విషయానికి సంబంధించిన సమాచారం లభించిన వెంటనే భేలూపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టామని నగర సీనియర్‌ ఎస్పీ అమిత్‌ పాథక్‌ తెలిపారు. అంతేకాకుండా సంఘటనతో సంబంధమున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వివరించారు. వారిలో అనధికారికంగా కార్యాలయ చిత్రాన్ని ఫోటో తీసి, ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టిన వ్యక్తి కూడా ఉన్నాడని ఆయన వెల్లడించారు.  ఇదిలా ఉండగా సమాచారం అందిన వెంటనే ఓఎల్‌ఎక్స్‌ ఆ అమ్మకపు ప్రకటనను తొలగించింది.

ఇవీ చదవండి

స్తంభం కూలి మీదపడింది.. వైరల్‌ వీడియో

నడిరోడ్డుపై దారుణ హత్యAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని