close

తాజా వార్తలు

Published : 05/12/2020 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిద్దిపేటలో రోడ్డుప్రమాదం.. ఐదుగురి మృతి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన బయ్యాపు నరేందర్‌రెడ్డి (39) న్యాయవాది‌. ఆయన తన తండ్రి రాజిరెడ్డి (62), తల్లి విజయ(58)తో కలిసి కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో సిద్దిపేట శివారు రంగిలా చౌరస్తా సమీపంలోని రహదారి పక్కన ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టింది.  దీంతో కారులో ఉన్న ఆ ముగ్గురూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న సిద్దిపేట రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొంతమంది స్థానికులు  అక్కడ గూమిగూడారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి అదే మార్గంలో వస్తున్న డీసీఎం వాహనం గుమిగూడిన ప్రజలపైకి దూసుకెళ్లింది. దీంతో చిన్నకొడూరు మండలం రామునిపట్లకు చెందిన మల్లేశం (40), సిద్దిపేట అర్బన్‌ మండలం మందపల్లి గ్రామానికి ఎల్లారెడ్డి(50) అక్కడిక్కడే మృతి చెందారు. రెండో పట్టణ సీఐ పరాశం గౌడ్‌, మరో నలుగురు పోలీసు సిబ్బంది సహా 10 మంది గాయపడ్డారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన