close

తాజా వార్తలు

గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం

గుంటూరు: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనను మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు రామిరెడ్డి నగర్‌లో నివాసముండే 5ఏళ్ల బాలికపై ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఇంటి కింద ఉంటున్న యవకుడే ఈ దుశ్చర్యకు పాల్పడటంతో బాలిక కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పాప కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాపని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.