close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 30/05/2020 04:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పదేళ్ల బాలికపై అత్యాచారం

శేరిలింగంపల్లి: తల్లిదండ్రులు పనికి వెళ్లగా అమ్మమ్మ వద్ద ఉన్న బాలిక (10)ను ఓ కామాంధుడు కాటేశాడు. చందానగర్‌ పోలీసుల వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ వాంబే నివాస సముదాయాల్లో ఓ పేద కుటుంబం ఉంటోంది. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కరోనా కారణంగా పని లేకపోవడంతో భార్యాభర్తలు తమ పెద్ద కుమార్తెను తీసుకొని పటాన్‌చెరులోని ఓ పరిశ్రమలో పనిచేయడానికి వెళ్లారు. చిన్న కుమార్తెను, ఆమె అమ్మమ్మను ఇంటి దగ్గర ఉంచారు. వేసవి కావడంతో ఉక్కపోస్తుందని గురువారం రాత్రి చిన్నారి, వృద్ధురాలు బయట పడుకున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన నిందితుడు (27) అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చి ఆ చిన్నారి నోరు మూసేసి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అలికిడికి పక్కింటిలో ఉంటున్న బాలిక బంధువు బయటకి వచ్చి ఇక్కడేం చేస్తున్నావని ప్రశ్నించడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. గదిలోకి వెళ్లి  అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.