close

తాజా వార్తలు

Published : 21/09/2020 01:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సరూర్‌నగర్‌లో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

హైదరాబాద్‌: నగరంలోని సరూర్‌నగర్‌లో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. తపోవన్‌ కాలనీలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి వరద నీటిలో పడి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బాలాపూర్‌ ప్రాంతంలోని సుమారు 35 కాలనీలకు చెందిన వరదనీరు మినీట్యాంక్‌బండ్‌లో కలుస్తోంది. భారీ వర్షం కురవడంతో మినీట్యాంక్‌బండ్‌కు వరదనీరు వెళ్తున్న మార్గంలో తపోవన్‌కాలనీ వద్ద కాసేపు నిరీక్షించిన సదరు వ్యక్తి.. ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో స్కూటీ పైనుంచి అదుపుతప్పి వరదనీటిలో పడిపోయాడు. 

వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. గల్లంతైన వ్యక్తి కోసం స్థానికులతో పాటు డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలిస్తున్నారు. ఇటీవల నేరేడ్‌మెట్‌లోని దీన్‌దయాళ్ నగర్‌‌ కాలనీలో సుమేధ అనే బాలిక సైకిల్‌పై వెళ్తూ నాలాలో కొట్టుకుపోయి మృతిచెందిన విషయం తెలిసిందే.

 



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.