close

తాజా వార్తలు

దేశ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో ఐటీ సోదాలు

దిల్లీ: ఆదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. నగదు నిల్వల్లో అక్రమాలు చేస్తున్నారన్న ఆరోపణలతో దేశంలోని 39 ప్రాంతాల్లో షేర్‌ బ్రోకర్లు, వ్యాపారులపై దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి భారత ఐటీ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ముంబయి, కోల్‌కతా, కాన్పూర్‌, దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, హైదరాబాద్‌, ఘజియాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు తెలిపింది. కృత్రిమ లాభ, నష్టాల కోసం బ్రోకర్లు అతి తక్కువ సమయంలో రివర్స్‌ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ వివాదాస్పద పద్దతి ద్వారా పలు యోగ్యత లేని సంస్థలు దాదాపు రూ.3500 కోట్లకు పైగా లాభ, నష్టాలను పొందాయని ఐటీ విభాగం అంచనా వేసింది. ఈ సోదాల్లో అధికారులు లెక్కలు లేని నగదు దాదాపు రూ.1.20 కోట్లు సీజ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి లావాదేవీల ద్వారా ప్రయోజనం పొందేవారు దేశవ్యాప్తంగా కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చని.. వారిని గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.