close

తాజా వార్తలు

అదనపు కట్నం కోసం భార్యపై హత్యాయత్నం

పరిస్థితి విషమం

పరిస్థితి విషమంగా ఉన్న సల్మా

మదనపల్లె (నేరవార్తలు), న్యూస్‌టుడే : అదనపు కట్నం తేలేదని, అనుమానంతో భార్యపై భర్త విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసిన ఘటన మదనపల్లె గ్రామీణ మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన సయ్యద్‌ హుస్సేన్‌వల్లికి గుర్రంకొండకు చెందిన సయ్యద్‌ సల్మా(24)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు ఆలియా(5), ఇలాహి(4) ఉన్నారు. కొన్ని రోజుల వరకు బెంగళూరులో ఎలక్ట్రిషన్‌గా పనిచేసే హుస్సేన్‌వల్లి ఏడాది క్రితం మదనపల్లెకు వచ్చి ఈశ్వరమ్మకాలనీలో ఉంటూ ఆటో నడుపుకొంటున్నాడు. అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తుండటంతో మూడు రోజుల క్రితం భార్య రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ చేసి పంపారు. మళ్లీ గొడవపడుతుండటంతో గుర్రంకొండలో ఉన్న పెద్దమనుషుల వద్దకు వెళ్లగా వారు ఇద్దరినీ మందలించి కలిసి కాపురం చేసుకోవాలని చెప్పారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు వీరిద్దరు మదనపల్లెకు వచ్చి మళ్లీ గొడవపడ్డారు. హుస్సేన్‌వల్లి కత్తితో భార్య గొంతు కోసి, విచక్షణా రహితంగా వీపుపై పొడిచాడు. ఆమె గట్టిగా కేకలేయడంతో స్థానికులు వచ్చి అతన్ని అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్‌ ఎస్సై హరిహరప్రసాద్‌ వచ్చి బాధితురాలిని, గాయపడిన హుస్సేన్‌వల్లిని ఆసుపత్రికి తరలించారు. సల్మా పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. భర్తపై హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసు బందోబస్తు మధ్య అతనికి మదనపల్లె జిల్లా వైద్యశాలలో చికిత్సలు చేయిస్తున్నారు. సల్మా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.