49కి చేరిన భూకంప మృతుల సంఖ్య

తాజా వార్తలు

Updated : 01/11/2020 16:08 IST

49కి చేరిన భూకంప మృతుల సంఖ్య

ఇజ్మిర్‌: టర్కీలో సంభవించిన భూకంపంలో మృతిచెందిన వారి సంఖ్య 49కి చేరింది. క్షతగాత్రుల సంఖ్య సైతం పెరిగింది. ప్రమాదంలో 896 మంది గాయపడినట్లు విపత్తు నిర్వహణ అధికారులు ఆదివారం వెల్లడించారు. భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 5 వేల మంది సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. టర్కీలోని ఇజ్మిర్‌ నగరంలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. భారీ ప్రకంపనలతో గ్రీకు ద్వీపమైన సామోస్‌లో స్వల్ప సునామీ ఏర్పడింది. భూకంపం ధాటికి భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. నిరాశ్రయులైన వేలాది మందికి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని