
తాజా వార్తలు
అఖిలప్రియకు బెయిల్ మంజూరు
హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సికింద్రాబాద్ న్యాయస్థానం వెల్లడించింది. మరోవైపు ఆమె భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి ముందస్తు పిటిషన్‌పై సోమవారం వాదనలు కొనసాగనున్నాయి.
హఫీజ్‌పేటలోని భూవివాదం నేపథ్యంలో ప్రవీణ్‌రావు, సునీల్ రావు, నవీన్‌రావు అనే ముగ్గురు సోదరుల కిడ్నాప్‌పై బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్, ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరికొందరి పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చారు. దీనిలో భాగంగా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి..
పోలీసు కస్టడీకి అఖిలప్రియ సహాయకులు
భార్గవ రామ్ కోసం ముమ్మర గాలింపు