
తాజా వార్తలు
టీవీ నటిపై అత్యాచారం..
దర్శకుడిపై కేసు నమోదు
ముంబయి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీవీ నటిని అత్యాచారం చేసిన ఓ దర్శకుడిపై కేసు నమోదు చేసిన ఘటన ముంబయిలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయికి చెందిన టీవీ నటికి, డైరెక్టర్‌కు గత రెండు సంవత్సరాలుగా పరిచయముంది. ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకంటానని సదరు దర్శకుడు నమ్మించాడు. అనంతరం చాలా సార్లు ఆమెపై అత్యాచారం చేశాడు.
దీంతో పెళ్లి విషయమై గత కొద్ది రోజులుగా నటి అతన్ని నిలదీయగా దాటవేస్తూ వచ్చాడు. చివరగా మోసపోయినట్లు గ్రహించి నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం అత్యాచారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేయలేదని వెర్సోవా పోలీసు అధికారి రాఘవేంద్ర ఠాకుర్ చెప్పారు.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు