
తాజా వార్తలు
20కి చేరిన నాసిక్ ప్రమాద మృతుల సంఖ్య
ముంబయి: మహారాష్ట్రలోని నాసిక్ రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 20కి చేరింది. నాసిక్‌లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటో రిక్షా, బస్సు ఒకదానినొకటి ఢీకొని బావిలో పడిపోవడంతో 20 మంది దుర్మరణం పాలయ్యారని సమాచారం. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. నాసిక్‌లోని మాలేగావ్ నుంచి ఓ బస్సు కల్వాన్కు బయలుదేరింది. ఈ క్రమంలో డియోలా ప్రాంతం వద్ద ఆటో రిక్షా, బస్సు ఒకదానినొకటి ఢీకొనడంతో అదుపుతప్పి రెండూ పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. ఈ ఘటనలో దాదాపు 20 మంది దుర్మరణం పాలవగా.. మరో 30 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా బయటకు తీశారు. ఈ బావి దాదాపు 70 అడుగుల లోతు ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.
Tags :