close

తాజా వార్తలు

Published : 20/10/2020 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కత్తి దొంగిలించి ఉన్మాది దారుణం

బెంగళూరు: మటన్‌ దుకాణంలో కత్తి దొంగిలించిన ఓ ఉన్మాది కనిపించిన వారిని పొడుచుకుంటూ పోయాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. ఆదివారం బెంగళూరులోని కాటన్‌పేట్‌ ప్రాంతంలో మటన్‌ షాపునకు వెళ్లిన గణేశ్‌ (30) అనే కూలీ దుకాణంలోని కత్తిని దొంగిలించి పారిపోయాడు. అనంతరం ఆ కత్తితో కనిపించిన వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఓ కూలీ మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. స్థానికులు ఉన్మాది విషయాన్ని పోలీసులకు తెలపడంతో వారు అప్రమత్తమయ్యారు. గణేశ్‌ సంచరిస్తున్న ప్రాంతాన్ని చుట్టుముట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాదిపై హత్య, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. గాయపడిన వారిలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.