గతేడాది రైలు ప్రమాదాల్లో 8,733 మంది మృతి

తాజా వార్తలు

Updated : 03/06/2021 04:29 IST

గతేడాది రైలు ప్రమాదాల్లో 8,733 మంది మృతి

దిల్లీ: గతేడాది కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైళ్లు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. అయినా రైలు ప్రమాద మృతుల సంఖ్యలో పెద్దగా మార్పేమి కనిపించలేదు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 8,700 మందికి పైగా మృతి చెందారు. మధ్యప్రదేశ్‌కి చెందిన చంద్ర శేఖర్‌ గౌర్‌ సమాచార హక్కు చట్టం కింద 2020 జనవరి నుంచి డిసెంబరు మధ్య ఎంత మంది మరణించారని రైల్వే బోర్డుని ప్రశ్నించారు. ‘‘వివిధ రాష్ట్రాల రైల్వే పోలీసులు అందించిన సమాచారం మేరకు 8,733 మంది రైలు ప్రమాదాల్లో చనిపోయారు. 805 మంది తీవ్ర గాయాల పాలయ్యారు’’ అని రైల్వే బోర్డు సమాధానమిచ్చింది. మృతుల్లో ఎక్కువ మంది లాక్‌డౌన్‌ కారణంగా రైల్వే ట్రాకుల వెంట కాలినడకన స్వస్థలాలకు పయనమైన వలస కూలీలే ఉన్నారు. 2020 కంటే నాలుగు సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే. అయితే, 2020 మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి చూస్తే మాత్రం ఈ గణాంకాలు ఆందోళన కలిగించేవే. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని