close

తాజా వార్తలు

ప్లాస్టిక్‌ పరిశ్రమలో మంటలు: 13మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాస్టిక్‌ కప్పులు, ప్లేట్‌లు తయారు చేసే ఓ పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులు మృతిచెందగా.. దాదాపు 21 మందికి పైగా తీవ్ర గాయాలైనట్టు  పోలీసులు గురువారం వెల్లడించారు. ఢాకా శివారులోని కేరానిగంజ్‌ వద్ద ఉన్న ప్లాస్టిక్‌ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా నిర్థారించలేదు. 

అయితే, ఎనిమిది గ్యాస్‌ సిలిండర్లు ఉన్న గది నుంచి ఈ మంటలు చెలరేగాయని ఓ క్షతగాత్రుడు స్థానికి మీడియాకు తెలిపాడు. ఈ కర్మాగారంలో దాదాపు 300 మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తుంటారు. ఈ దుర్ఘటన సమయంలో దాదాపు 150 మంది కార్మికులు ఉన్నారు. ప్లాస్టిక్‌ కప్పులు, ప్లేట్లను తయారు చేసే ఈ కర్మాగారానికి ఎలాంటి అనుమతులూ లేవని తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.