
తాజావార్తలు
హైదరాబాద్: ‘భయపడేవాడే బేరాలకొస్తాడు. మన దగ్గర బేరాల్లేవమ్మా..’ అని అంటున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆయన కథానాయకుడి నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్‌స్టార్ అభిమానులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఈ చిత్ర టీజర్ శుక్రవారం విడుదలయ్యింది. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ అదరగొట్టారు. ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్’ అంటూ ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి చెప్పిన డైలాగ్ హృదయాలను హత్తుకునేలా ఉంది. అలాగే టీజర్ చివర్లో ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు.’ అని మహేశ్‌ను ఉద్దేశిస్తూ ప్రకాశ్‌రాజ్ చెప్పిన డైలాగ్ అభిమానులతో విజిల్స్ వేయిస్తోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి మాస్, ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఆర్మీ అధికారి అయిన మహేశ్‌కు కర్నూలులో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే! దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
దేవతార్చన
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ