close

తాజావార్తలు

ఇందులో అల్లు అర్జున్‌ ఎక్కడున్నారో తెలుసా?

అల్లు రామలింగయ్యతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న బన్ని

హైదరాబాద్‌: తన స్టైల్‌, నటనతో యువతను విశేషంగా ఆకట్టుకుంటున్న కథానాయకుడు అల్లు అర్జున్‌. కేవలం వెండితెరపైనే కాదు, సామాజిక మాధ్యమాల వేదికగానూ బన్ని ఎప్పుడూ అభిమానులకు చేరువగా ఉంటారు. తన సినిమాలు, పిల్లల గురించి అనేక విషయాలను ఆయన పంచుకుంటారు. తాజాగా బన్ని పంచుకున్న ఓ ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ హాస్యనటుడు, అల్లు అర్జున్‌ తాత అల్లు రామలింగయ్య పద్మశ్రీ అవార్డు అందుకుని తిరిగి వచ్చిన సందర్భంగా మెగా కుటుంబానికి చెందిన పిల్లలందరూ కలిసి ఆయనతో దిగిన ఫొటోను బన్ని పంచుకున్నారు. ఈ ఫొటోలో బన్నీ అల్లు రామలింగయ్య ముందు పూలదండ వేసుకుని నిల్చుని కనిపించారు.

‘‘మా తాతయ్య గౌరవ పద్మశ్రీ అవార్డు అందుకుని వచ్చిన అనంతరం మేమంతా ఆయనను ఎయిర్‌పోర్ట్‌లో కలిశాం. ఫ్రమ్‌ పాలకొల్లు టు పద్మశ్రీ. అద్భుతమైన ప్రయాణం’’- ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌

అల్లు రామలింగయ్య నట వారసత్వాన్ని చిరంజీవి నుంచి స్ఫూర్తిని పొంది బన్ని కథానాయకుడిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, పోస్టర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.