close

తాజావార్తలు

బోనీకపూర్‌ చేతికి ‘కోమాలి’ రీమేక్‌ రైట్స్‌

కోమాలి

కోడంబాక్కం, న్యూస్‌టుడే: జయంరవి హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం ‘కోమాలి’. 90స్‌ కిడ్స్‌కు సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను వేల్స్‌ ఫిలిమ్స్‌ బ్యానరుపై ఐసరి గణేశ్‌ నిర్మించారు. ప్రదీప్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయం సాధించిన సందర్భంగా ఇటీవల దర్శకుడికి కొత్త కారును నిర్మాత బహూకరించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిందీ రీమేక్‌ హక్కులకు పెద్ద పోటీ నెలకొంది. చివరకు శ్రీదేవి భర్త బోనీకపూర్‌ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు. హిందీతో పాటు తెలుగు, కన్నడ రీమేక్‌ హక్కులను ఆయన సొంతం చేసుకున్నట్లు సమాచారం. అజిత్‌ నటించిన ‘నేర్‌కొండ పార్వై’ చిత్రంతో తమిళంలో నిర్మాతగా అడుగుపెట్టారు బోనీకపూర్‌.

బోనీకపూర్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.