close

తాజావార్తలు

‘మాఫియా’ బృందానికి రజనీ అభినందనలు

టీనగర్‌: కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వంలో అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మాఫియా’. ఈ చిత్ర బృందాన్ని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అభినందించారు. ధ్రువంగల్‌ పదినారు చిత్రం తర్వాత కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మాఫియా’ చిత్రం షూటింగ్‌ వేగం పుంజుకుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అరుణ్‌ విజయ్‌కి జంటగా ప్రియా భవాని నటిస్తున్నారు. ప్రసన్న విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు కార్తిక్‌ నరేన్‌ రజనీకాంత్‌ను కలిసి చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ప్రదర్శించారు. అది చూసిన వెంటనే అద్భుతంగా ఉందంటూ, బ్రిలియంట్‌ వర్క్‌ చేశారంటూ చిత్ర బృందాన్ని రజనీ అభినందించారట.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.