స్క్రీన్‌పై చూడాలంటే ఐదేళ్లు ఆగక తప్పదా..?
హైదరాబాద్: రామ్‌చరణ్-యశ్.. ఒకరేమో తెలుగులో స్టార్ హీరో.. మరొకరేమో కన్నడలో రాక్‌స్టార్.. వీరిద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకునే అభిమానుల కలను ప్రముఖ దర్శకుడు శంకర్ నిజం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్-2’ పనుల్లో బిజీగా ఉన్న శంకర్ త్వరలో ఓ బిగెస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ను తెరకెక్కించనున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం పవన్‌కల్యాణ్-చరణ్ స్క్రీన్ పంచుకోనున్నారని ఇటీవల నెట్టింట్లో పలు పోస్టులు చక్కర్లు కొట్టాయి.
కాగా, తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ‘ఇండియన్-2’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించే పనుల్లో ఉన్న శంకర్ అతి త్వరలో ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి అనంతరం ఓ యాక్షన్ డ్రామాను ప్రారంభించనున్నారని.. హిస్టరికల్ వార్ డ్రామాగా(చారిత్రాత్మక యుద్ధ కథాంశం) అది తెరకెక్కనుందని సమాచారం. 2022 నుంచి పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నట్లు చిత్రపరిశ్రమలో భోగట్టా. అంతేకాకుండా నటీనటులుగా ఎవర్ని తీసుకోవాలనే విషయంలో శంకర్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. ఇందులో ఓ పాత్ర కోసం కన్నడ నటుడు యశ్‌ను ఫిక్స్ చేసిన దర్శకుడు మరో పాత్ర కోసం మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని.. కోలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడు సైతం ఇందులో భాగం కానున్నారంటూ టాక్ వినిపిస్తోంది. అయితే, సదరు వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి
పెళ్లికి ముందు మా ఇద్దరికి బ్రేకప్ అయ్యింది!
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
- ‘సలార్’ విడుదల తేదీ ఖరారు
- అప్పుడు ‘రామన్న’.. ఇప్పుడు ‘క్రిష్ణయ్య’
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
-
‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ
-
నిశినలా విసురుతూ..శశినువ్వై మెరవగా
-
‘బతుకే బస్టాండ్..’ అంటూ నితిన్ చిందులు!